24-02-2025 12:00:00 AM
పటాన్ చెరు, ఫిబ్రవరి 23 : రామచంద్రాపురం శ్రీనివాస్ నగర్ కాలనీలోని పోచమ్మ తల్లి దేవాలయం ఆలయ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆదివారం పాల్గొన్నారు. కార్పొరేటర్ పుష్ప నగేష్ స్థానిక నాయకులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఎమ్మెల్యే ను ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమ్మవారి దయతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.