calender_icon.png 21 April, 2025 | 6:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్‌ని అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది

13-04-2025 07:21:21 PM

సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు

మంచిర్యాల,(విజయక్రాంతి): అంబేద్కర్‌ని అడుగడుగునా అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదనీ సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై బిజెపి నాయకులు రఘునాథ్ వెరబెల్లి నస్పూర్ పట్టణంలో సీసీసీ కార్నర్ వద్ద అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ధి చేసి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ అంత్యక్రియలు ఢిల్లీలో జరగనివ్వకుండా ముంబైకి వారి పార్థివదేహాన్ని తరలించి, ఆ తరలింపుకయ్యే విమాన ఛార్జీల బిల్లులు చెల్లించాలని అంబేద్కర్ సతీమణికి బిల్లులు పింపిన నీచాతినీచమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీదనీ ఎద్దేవా చేశారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచనా విధానాన్ని బలపరిచిన అంబేద్కర్ కు, ఆయన ఆలోచనలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం తగిన గౌరవం ఇస్తోందన్నారు.

భావితరాలకు అంబేద్కర్ చరిత్ర తెలిసేలా పంచ తీర్థాలను ఏర్పాటు చేయడంతో పాటు, దళితుడైన రామ్ నాథ్ కోవింద్ ను, ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్ములను రాష్ట్రపతి చేసింది, అణగారిన వర్గాల్లో వెలుగులు నింపిన అంబేద్కర్ కు భారతరత్న కోసం బిజెపి కృషి చేసిందన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా 12 మంది దళితులకు, 27 మంది ఓబీసీలకు, 8 మంది మహిళలకు మోదీ ప్రభుత్వం తమ కేబినెట్ లో చోటు కల్పించిందనీ, అంబేద్కర్ కలలను సాకారం చేస్తూ బడుగు బలహీన వర్గాల ప్రజలకు మోదీ ప్రభుత్వం అభివృద్ధిని పరిచయం చేసిందన్నారు.