14-04-2025 08:20:00 PM
తరిగొప్పుల (విజయక్రాంతి): అంబేద్కర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఖాతా బాలయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ... జై భీం, జై భీం, కొనసాగిస్తాం, అంబేద్కర్ ఆశయాలని, దేశంలో ఒక్క నలుగురు వ్యక్తులు దేశం కోసం పని చేశారు. బాబు జన్జీవన్ రావు, పులే,సావిత్రి భాయ్ పులే వీరు పని చేశారు. ఇవ్వాలా ప్రతి ఒక్కరూ చదువుతున్నారు. అంటే దానికి కారణం వీరు రచించన రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగంలో ఏం రాసిందో దానికి లోబడే చేసుకోవాలి కానీ రాజ్యాంగాన్ని దాటి ఏమి చేయడానికి లేదు ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం మనది అలాగే అందరికంటే శక్తివంతమైనది మన రాజ్యాంగం మనకి ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఇచ్చారు.
భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ నీ పూజిం చాల్సిందే, కీర్తించాల్సిందే . ఎస్సీ కమ్యూనిటీ హాల్ కట్టి స్తానని హామీ ఇచ్చారు. అబ్దుల్ నగరం నాకు మంచి ఆధారం ఇచ్చింది గత ఎలక్షన్లలో తరిగొప్పుల లేని అన్ని చెరువులలో కూడా నీళ్లు వచ్చే విధంగా పనులు జరుగుతున్నాయని. నేను ఎన్నికలలో ప్రచారం మొదలుపెట్టింది ఇక్కడినుండి అని ప్రజలకు గుర్తు చేశారు. మన మండలంలో పోతారం, అక్కరాజు పల్లి గ్రామాలకు మాత్రమే నీళ్లు వచ్చేవి అని, మీరు నన్ను ఆశీర్వదించినందుకు మొట్టమొదటి బహుమానంగా నీళ్లు అందిస్తున్నానని, మీ గ్రామంలోని అన్ని కుటుంబాలు అందరూ కూడా సుఖసంతోషాలతో ఉండాలని ఆ మహనీయుని కోరుకుంటున్నానని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు చింతల రమేష్, కోశాధికారి మేకల కిష్టయ్య, కార్యదర్శి చింతల సురేష్ బాబు, సుక్క యాదగిరి, చింతల్ ఎల్లయ్య, బాలకిష్టయ్య, వెంకన్న, కుమార్, పరుశురాములు, సందీప్, ఖాతా బాలయ్య,సభ్యులు, మండల నాయకులు, నరసింహారావు, జూమ్ లాల్, అర్జుల సంపత్ రెడ్డి, భాష బోయిన రాజు, తాళ్లపల్లి రాజేశ్వర్, చిలువేరు లింగం, భోగ శీను, రామరాజు, తదితరులు పాల్గొన్నారు.