calender_icon.png 19 April, 2025 | 5:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిడుగుపాటుకు గురైన రైతులకు గాయాలు

18-04-2025 10:38:22 PM

పరామర్శించిన జనగామ ఎమ్మెల్యే పల్ల 

జనగామ(విజయక్రాంతి): జనగామ జిల్లా బచ్చన్న పేట మండలం అలింపురం గ్రామంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రం వద్ద బుధవారం పిడుగుపాటు గురై దాదాపుగా 12మంది రైతులు గాయాలపాలయ్యారు. వెంటనే ఘటన స్థలంలో ఉన్న స్థానికులు జనగామ జిల్లా ప్రభుత్వం హాస్పిటల్ కు తరలించారు. విషయం తెలుసుకున్న జనగామ ఎమ్మెల్యే  పల్లా రాజేశ్వర్ రెడ్డి  వెంటనే అక్కడికి చేరుకొని గాయాలు పాలైన రైతులందరిని పరామర్శించి ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం కోసం అవసరమైతే హైదరాబాద్ కు తరిలించేలా ఏర్పాటు కూడా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.