calender_icon.png 4 March, 2025 | 3:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆశా వర్కర్లపైకి పోలీసులను ఉసిగొల్పారు: పల్లా రాజేశ్వర్ రెడ్డి

09-12-2024 05:11:10 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ తల్లుల వంటి మహిళలను అరెస్టు చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. కోఠిలోని డీఎంహెచ్ఎస్ కార్యాలయం వద్ద సోమవారంనాడు ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శాలు చేశారు. రాష్ట్రంలో 12 వేల మంది సర్పంచ్ లు ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు చేపట్టిన పనులకు వేల కోట్ల బిల్లులు చెల్లిస్తున్నారని, చిన్న చిన్న పనులు చేసిన సర్పంచ్ లకు బిల్లులు ఎందుకు చెల్లించటం లేదని ఆయన మండిపడ్డారు.

ఆశా వర్కర్లపైకి పోలీసులను ఉసిగొల్పారని పల్లా ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదికాలంగా అన్ని విషయాల్లో విఫలమైందని, గ్రామాల్లో వీధిదీపాలకు కూడా డబ్బులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆశా వర్కర్ల జీతం 18వేలు పెంచుతామని హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ ప్రకారం తమకు 18వేల వేతనాలు పెంచాలని కోఠిలోని డీఎంహెచ్ఎస్ కార్యాలయాన్ని ముట్టడించిన ఆశా వర్కర్లను పోలీసులు అరెస్టు చేశారు.