calender_icon.png 4 March, 2025 | 10:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే పద్మారావుగౌడ్‌కు గుండెపోటు

22-01-2025 12:43:46 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 21(విజయక్రాంతి) : మాజీ మంత్రి,  సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్‌కు మంగళవారం గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులతో కలిసి ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ పర్య  ఉండగా ఆయన గుండెపోటుకు గురయ్యారు. అప్రమత్తమైన కుటుంబసభ్యులు హుటాహుటిన ఆయనను ఆస్పత్రికి తరలించారు.

వైద్యులు ఆయనకు స్టంట్ వేశారని.. ప్రాణాపాయం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం రాత్రి పద్మారావుగౌడ్‌ను హైద  తీసుకువచ్చారని సమాచారం. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. పద్వారావుగౌడ్‌ను ఫోన్‌లో పరామర్శించారు. అనంతరం తాను ఆరోగ్యంగానే ఉన్నానని కార్యకర్తలు, అభిమానులు ఆందో  చెందవద్దని పద్వారావుగౌడ్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.