calender_icon.png 12 January, 2025 | 5:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయి

12-01-2025 02:14:32 PM

హుజూరాబాద్,(విజయక్రాంతి): క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Huzurabad MLA Padi Kaushik Reddy) అన్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో ఆదివారం జిల్లా సాయి వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ... గెలుపు ఓటములను క్రీడాకారులు స్ఫూర్తిగా తీసుకొని రాణించాలన్నారు. క్రీడలతో పాటు చదువు ముఖ్యమని క్రీడాకారులకు సూచించారు.

క్రీడలు శారీరక దృఢత్వాన్ని ఆరోగ్యాన్ని పెంపొందించడంలో  కీలకపాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. క్రీడాకారులు జిల్లా స్థాయిలోనే కాక రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని క్రీడాకారులను కోరారు. వీణవంక వర్సెస్ రెడ్డిపల్లి మ్యాచ్ను తాసివేసి ప్రారంభించారు. ఆయనతోపాటు వీణవంక మాజీ ఎంపీపీ మూసి పట్ల రేణుక -తిరుపతిరెడ్డి మాజీ సర్పంచ్ నీల కుమార్, వీణవంక పట్టణ అధ్యక్షుడు మహేష్ గౌడ్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.