పోలీసులతో నా ఫైట్ కాదని, రేవంత్ రెడ్డితో నాఫైట్
హుజూరాబాద్,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని, కేసులకు భయపడేదిలేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Huzurabad MLA Padi Kaushik Reddy) అన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం(MPDO office)లో 168 కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కు(Kalyana Lakshmi, Shaadi Mubarak Cheque)లను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పొడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. నా కొట్లాట పోలీసులతోని కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మేనమామలా మంచి ఉద్దేశ్యంతో 50వేల రూపాయలతో లక్షా నూటపదహారు రూపాయలకు పెంచి తెలంగాణ ఆడబిడ్డలకు అసరయ్యారు. ఎన్నికలప్పుడు కాంగ్రెస్ నాయకులు తులంబంగారమిస్తమని మహిళల సెంటిమెంట్నుఆసరాగాచేసుకొని హామీలిచ్చి నెరవేర్చడం లేదని అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల హామీ ప్రకారం ప్రతీ మహిళకు 2500 రూపాయలుఅందించే వరకు ఎన్ని కేసులు పెట్టినావెనుకాలేదిలేదన్నారు. గర్భిణీలకు ఉచితంగాడెలివరీ చేసి బిడ్డకు కేసీఆర్ కిట్టుఇచ్చి, మగబిడ్డ పుడితే రూ.12000,ఆడబిడ్డ పుడితే రూ.13000 ఇచ్చి కేసీఆర్ హయాంలోఆడబిడ్డను ఇంటికి సురక్షితంగా పంపమన్నారు.