హుజురాబాద్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దళిత బంధు రెండో విడత నిధులు రానివారు ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇవ్వాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. దీంతో దళిత బంధు రాని లబ్ధిదారులు ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్నారు. వారితో కలిసి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అంబేద్కర్ చౌరస్తాకు చేరుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ధర్నాకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకునే క్రమంలో లబ్ధిదారులకు పోలీసులకు తోపులాట జరిగింది. ఓ మహిళకు తీవ్ర గాయాలు కాగా, రాకేష్ అనే యువకుడు సొమ్మసిల్లి పడిపోయాడు. ఈ తోపులాటలో కౌశిక్ రెడ్డికి శ్వాస ఆడక పోవడంతో పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దళిత బంధు లబ్ధిదారు కరీంనగర్ వరంగల్ ప్రధాన రహదారిపై సుమారు రెండు గంటలపాటు ధర్నా నిర్వహించారు.