హైదరాబాద్,(విజయక్రాంతి): హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాసబ్‌ట్యాంక్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం విచారణ హజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ డిసెంబర్ 4న బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన సందర్భంలో సీఐను అడ్డుకుని వాగ్వాదం జరిగిన అంశంపై కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ ఘనటపై ఇవాళ ఆయన విచారణ నిమిత్తం మాసబ్‌ట్యాంక్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ... బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు పిటీషన్ ఇచ్చేందుకు సీఐ దగ్గరికి వెళ్లినప్పుడు.. ప్రజా ప్రతినిధిగా తాను ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినప్పుడు రిసీవ్ చేసుకోవాల్నా వద్దా.. అని ప్రశ్నించారు.
కానీ, అలా చేయకుండా ఆయన బయటకి పరుగులు పెట్టబోయారు. ఈ సమయంలో సీఐ బయటకు వెళ్తుండగా.. కౌశిక్ రెడ్డి పిటీషన్ ఇచ్చేందుకు వచ్చానని చెప్పానన్నారు. పిటిషన్ తీసుకుని బయటకు వెళ్తే అయిపోతుంది కదా అని, అడిగినట్లు ఆయన చెప్పారు. పిటీషన్ ఇచ్చిన రెండు గంటల తర్వాత నాపై పోలీసుల విధులకు ఆటంకం కలిగించినట్టుగా తనపై కేసు నమోదు చేయడాన్ని అభ్యంతరం వ్య క్తం చేశారు. ప్రజా ప్రతినిధిగా, బాధ్యత గల పౌరుడిగా విచారణకు సహకరించేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చినట్టు తెలిపారు.