రాజేంద్రనగర్, జనవరి 31: మంత్రి శ్రీధర్ బాబు పర్యటనపై ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులకు పలు సూచనలు చేశారు. బండ్లగూడ జాగీర్ నగర పాలక సంస్థ నూతన కార్యాలయ భవనాన్ని ఆయన సందర్శించారు. బీజేఎంసి 10వ డివిజన్ లో నిర్మించిన భవనాన్ని ఆయన పరిశీలించారు.
సర్వే నంబర్ 181లో 2.07 ఎకరాల విస్తీర్ణంలో 32,250 చదరపు అడుగుల్లో రూ.1282 లక్షలతో ప్రజల సౌకర్యార్థం అన్ని వసతులతో భవనం నిర్మించినట్లు వివరించారు. ఈనెల 6న ఉదయం 10.30 గంటలకు మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు.
మంత్రి పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండాలని ఎమ్మెల్యే ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ శరత్ చంద్ర, మాజీ కార్పొరేటర్లు, మునిసిపల్ అధికారులు, వివిధపార్టీల నాయకులు పాల్గొన్నారు.