మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా పట్టణ కేంద్రంలో సీసీ రోడ్డు పనులకు మానుకొట ఎమ్మెల్యే మురళీ నాయక్ శంకుస్థాపన(Laid Foundation Stone) చేశారు. వివరాల్లోకి వెళ్తే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని 14వ వార్డులో రోడ్డు లేక కాలనీ వాసులు నానా ఇబ్బందులకు గురికాగా ఎమ్మెల్యే మురళీ నాయక్‌కు సమస్యను చేరవేయగా స్ధానిక కౌన్సిలర్ పోతురాజు, ఎమ్మెల్యే మురళీ నాయక్(MLA Murali Nayak) వెంటనే స్పందించి వారి స్పెషల్ డెవలప్‌మెంట్ నిధుల నుండి రూ.5 లక్షల నిధులను మంజూరు చేసి సోమవారం సీసీ రోడ్డు నిర్మాణ పనుల(CC Road Construction)కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీ మాట్లాడుతూ... 14వ వార్డు కాలనీలో ఏ సమస్యలు ఉన్న తన వద్దకు తీసుకురావాలని నేను మీకు అండగా ఉంటా అని ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని మీరు ప్రభుత్వానికి అండగా ఉంటే మీకు ప్రభుత్వం అండగా ఉటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు