మహబూబాబాద్,(విజయక్రాంతి): మానుకోట నియోజకవర్గంలో ఎమ్మెల్యే మురళి నాయక్ సుడిగాలి పర్యటన చేసి పలు పనులకు శంకుస్థాపనలు చేశారు. ముందుగా మహబూబాబాద్ మున్సిపాలిటి పరిధిలోని ఆర్టీసీ ప్రాంగణంలో స్వామి వివేకానంద విగ్రహావిష్కరణకు ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా హాజరై ఆవిష్కరించారు. అనంతరం గూడూరు మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో జీవీకే ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీస్(GVK EMRI Green Health Services) ఆధ్వర్యంలో 108,102 అంబులెన్స్‌లు ప్రారంభించారు. అనంతరం గూడూరు మండలంలోని మచ్చర్ల గ్రామంలో ఎన్ ఆర్ ఇజీ ఎస్ 5లక్షల రూపాయల నిధులలతో సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంఖుస్ధాపన చేశారు. అనంతరం గూడూరు మండలంలోని ఎర్రకుంట తండా గ్రామపంచాయితీ పరిధీలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం భూమిని ఎమ్మెల్యే పరిశీలించారు.