calender_icon.png 10 January, 2025 | 10:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మురళీ నాయక్

06-01-2025 10:54:08 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మహబూబాబాద్, నెల్లికుదూరు, గూడూరు, కేసముద్రం, ఇనుగుర్తి అన్ని మండలాలు వివిధ గ్రామాలకు సంబందించిన 217 మంది బాధితులకు మంజూరైన రూ.65,87,500 సీఎం సహాయనిధి చెక్కుల(CM Relief Fund Cheque)ను బాధితులకు ఎమ్మెల్యే మురళీ నాయక్(MLA Murali Nayak)  పంపిణీ చేశాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీ మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అంకితభావంతో పనిచేస్తుందని అన్నారు. ముఖ్యంగా ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు వైద్య చికిత్స కోసం లేదా అత్యవసర సమయంలో ఆర్ధిక సంహాయం అవసరమైన సందర్భాల్లో సీ ఎం సహాయనిధి ద్వారా అందిస్తున్న సహాయాన్ని కొనియాడారు. ఈ నిధి అనేక కుటుంబాల్లో జీవనోపాధి కోసం మద్దతు లబిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో లబ్దిదారులు పాల్గొన్నారు.