calender_icon.png 10 January, 2025 | 10:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైవే అధికారిని కలిసిన ఎమ్మెల్యే

31-12-2024 01:26:02 AM

జగిత్యాల అర్బన్, డిసెంబర్30: జగిత్యా ల జిల్లా కేంద్రం నుండి వెళ్తున్న జాతీయ రహదారి ఎన్‌హె 63, జగిత్యాల- అనంతారం వరకు బ్లాక్ స్పాట్ రహదారిగా అభివృద్ధి పరచాలని కోరుతూ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్’కుమార్ నేషనల్ హైవేస్ ప్రాంతీయ అధికారి పి.శివశంకర్’కు వినతి పత్రం అందజేశారు.

ఎనె 63 జాతీయ రహదారి నిజామాబాద్ నుండి ధర్మపురి రోడ్డు జగదల్‌పూర్ వరకు  జగిత్యాల్ పట్టణం యావర్ రోడ్డు నుండి వెళ్తుందని, జిల్లా  కేం ద్రం  లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్నందున రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతు న్నాయన్నారు. రోడ్డుప్రమాదాల నివారణకు జగిత్యాల నుండి అనంతారం వరకు బ్లాక్ స్పాట్ రోడ్డుగా అభివృద్ధి పరచాలని వినతి పత్రంలో కోరారు.

ఈ సందర్భంగా నేషనల్ హైవేస్ రీజినల్ ఆఫీసర్ పి.శివశంకర్  సాను కూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపా రు. ఇటీవల నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్’ని కలిసి ఇదే విషయంపై వినతి పత్రం అందజేయగా స్పందించిన ఎంపీ కేంద్ర జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరిని కలిసి జగిత్యాల అనంతారం రోడ్డు ను బ్లాక్ స్పాట్ రోడ్డుగా అభివృద్ధి పరచా లని కోరారని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్’కు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.