వనపర్తి,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వారి కుటుంబ వివరాలను నమోదు చేయించుకున్నారు. మంగళవారం పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా తన సొంత గ్రామం పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామానికి వెళ్ళిన ఎమ్మెల్యే తో సర్వే అధికారులు కుటుంబ వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలలో సర్వే చేపట్టిన అధికారులు సంయమానం పాటిస్తూ ప్రతి కుటుంబ వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని ఆయన సూచించారు. వివరాల నమోదు కోసం ఇళ్ల వద్దకు వచ్చే సర్వే బృందానికి కుటుంబ సభ్యులు పూర్తిస్థాయిలో సహకరించి వివరాలను నమోదు చేయించుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం ఎక్కడికక్కడ సర్వేలో పాల్గొనాలని ఎమ్మెల్యే ఆదేశించారు.