16-04-2025 11:53:39 AM
వనపర్తి, (విజయక్రాంతి): పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామంలో మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక నాయకులతో కలిసి బుధవారం ఎమ్మెల్యే మేఘా రెడ్డి(MLA Megha Reddy) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి, మాజీ జెడ్పిటిసిలు వెంకటస్వామి, రమేష్ గౌడ్, మాజీ సర్పంచులు, రమేష్ యాదవ్, శ్రీనివాసరెడ్డి, బాల్ చంద్రయ్య, సాక వెంకటయ్య, మాజీ ఎంపీటీసీలు రామచంద్రయ్య గౌడ్, సత్య రెడ్డి, అమ్మపల్లి వెంకటేశ్వర రెడ్డి, గట్టు యాదవ్, బాలు, మహిళా సమాఖ్య అధికారులు సిబ్బంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.