ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం అంటే నాకు ఒక్కడికే కాదు ప్రజలందరిదీ
గత ప్రభుత్వం చేసిన అప్పులకు మిత్తిలు కడుతూ అభివృద్ధి చేస్తున్నాం
అధికారం పోయే సరికి ఎం చేయాలో అర్థం కాక కొడంగల్, కొండారెడ్డి పల్లి కీ వెళ్లి లొల్లి పెడుతున్నారు
సంవత్సర కాలంలోనే 50 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం
అన్ని రకాల సౌకర్యాలు కలిగించే విధంగా త్వరలోనే హెల్త్ ప్రొఫైల్ డిజిటల్ కార్డు..
225 మందికి 45 లక్షల సి ఎం సహాయ నిధి
359 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు
ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
వనపర్తి,(విజయక్రాంతి): గడిచిన అసెంబ్లీ ఎన్నికలో తనన్ను నియోజకవర్గం నుండి గెలిపించండి పెద్ద జీతగాడిలా నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం పని చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందని, ఇచ్చిన మాట ప్రకారంగా పని చేస్తున్నానని, ఏమైనా ఇబ్బందిగా అనిపించినట్లయితే నేరుగా నా ఛాంబర్ కీ చెబితే మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రం లోని నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వం నుండి మంజూరు అయిన 225 మండి 45 లక్షల సిఎం సహాయ నిధి, 359 మండి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే పంపిణి చేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం తన ఒక్కడికే సంబందించిన కార్యాలయం కాదని, ఇది ప్రజల ఇల్లు అన్నారు. అందుకే మీ అందరి సమక్షంలో సీఎం సహాయ నిధి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణి కార్యక్రమంను నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల నుండి కుర్చీలో ఉండి అధికారం పోయేసరికి ఏం చేయాలో అర్థం కాకా ఇష్టానుసారంగా మాట్లాడుతు కొడంగల్, కొండారెడ్డి పల్లికి వెళ్లి లొల్లి పెడుతున్నారని మండిపడ్డారు. గడిచిన సంవత్సరాల కాలం నుండి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఎంత చేసామో ప్రజలకు వివరిస్తూ ప్రజా పాలనా విజయోత్సవాలు చేస్తున్నాం.
గత ప్రభుత్వం 10 ఏండ్ల కాలంలో రూ.7.27 లక్షల కోట్లు అప్పు చేసిన దానికి నెలకు 6 వేల కోట్లు మిత్తిలు కడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలో అన్ని అమలు చేస్తూ వస్తోంది. ప్రాజెక్టులు అభివృద్ధి ఎలా చేయాలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసాని, కబ్జాదారుల నుండి నేర్చుకోవాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదన్నారు. ప్రభుత్వం ఏర్పాటు అయినా 48 గంటల్లో ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 32 లక్షల మందికి 18 వేల కోట్లు రుణమాఫి చేసిందని, కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొంతమంది రైతులకు కాలేదని అలాంటి వారికీ ఈ నెల 30వ తేదీన మహబూబ్ నగర్ కు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారు.
అప్పుడే రైతుభరోసా కింద ఎకరానికి 15 వేలు కూడా ప్రారంభమవుతుందన్నారు. 10 ఏండ్ల నుండి ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత 50 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పావలా వడ్డీకి మహిళల అభివృద్ధి కోసం ప్రవేశ పెట్టిందని, నేడు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో మహిళలకు ఉచితంగా రుణాలు ఇచ్చే విధంగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. అన్ని రకాల సౌకర్యాలు కలిగిన విధంగా హెల్త్ ప్రొఫైల్ డిజిటల్ కార్డు ఇస్తూ, దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక్క కార్డుతో పని మొత్తం అయిపొతుందని ఎమ్మెల్యే వివరించారు.
విద్యాపర్తి ఉన్న వనపర్తి లో 150 కోట్ల తో ఇంటిగ్రెటెడ్ విద్య హబ్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని అందుకు సంబందించిన జి వో ఇటీవల మంజూరు కావడం జరిగిందని, ఈ పాఠశాలలో 4 వ తరగతి నుండి డిగ్రీ వరకు ఉంటుంది ఏ రంగంలో వెళ్ళుతారో అందులోనే ట్రేనింగ్ ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే వివరించారు. ముఖ్యమంత్రి చదివిన పాఠశాల, కళాశాల త్వరలో రూ 160 కోట్ల తో పాఠశాల కళాశాల రూపు రేఖలు మారుతుందన్నారు. వనపర్తి లో పని పాట లేనోలు ఇష్టా రీతిగా మాట్లాడుతున్నారని పనులు చేసిన కూడా బిల్లులు రాకుండా వారికీ తమ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత రూ 250 కోట్లు కాంట్రాక్టర్లకు పెండింగ్ లో ఉంటే వాళ్లకు బిల్లులు మంజూరు చేయించడం జరిగిందన్నారు.
మున్సిపాలిటీ పరిధిలో ని కాలనీలో ఉన్న సమస్యలను పట్టించుకోకుండా టఫ్ ఐ డి సి నిధులను చెరువులకు కుంటలకు వాడరని రేపు డిసెంబర్ నెలలో . రూ 35 కోట్ల తో జిల్లా కేంద్రం లోని ప్రతి వార్డు లో సిసి రోడ్డు డ్రెనేజి లు నిర్మించి శాశ్వత పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు. వనపర్తి, పెబ్బేరు మున్సిపాలిటీ లో తాగు నీటికి కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నాయని నా దృష్టి కీ రావడం జరిగింది భవిష్యత్తు లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రణాళిక లు సిద్ధం చేయడం జరిగిందని త్వరలోనే సమస్య ను పరిష్కారించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే రూ 35 కోట్ల తో పెద్ద మందడి, 5 కోట్లు ఖిల్లా ఘనపురం, 10 కోట్ల తో పెబ్బేరు రోడ్డు సుందరి కరణ చేసేందుకు ప్రణాళిక లు సిద్ధం చేయడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు.
డిసెంబర్ 21 వ తేదీన జిల్లా కేంద్రం లో 150 కంపెని లతో జాబ్ మేళా పెట్టడం జరుగుతుందని ఈ జాబ్ మేళా వల్ల దాదాపు 600 మంది కీ ఉద్యోగాలు ఇప్పిచడం జరుగుతుందన్నారు. రూ 1000 కోట్లు చిన్న సన్న కారు పరిశ్రమల ఏర్పాటు కోసం ఇవ్వడానికి వనపర్తి, నాగర్ కర్నూల్ యువత రుణ మేళా ను నిర్వహించడం జరుగుతుందని ఈ రుణ మేళా ను యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. కొన్ని సోషల్ మీడియా, కొన్ని ఛానెల్స్, కొన్ని పత్రికలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేయడం లేదని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. వాళ్ల మాటలు నమ్మల్సిన అవసరం లేదు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడం జరుగుతుందన్నారు.
గత ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించిన సందర్భాలు లేవు: కౌన్సిలర్ చీర్ల సత్యం
అభివృద్ధి కార్యక్రమం లో ఏ రోజు కూడా ప్రోటోకాల్ పాటించిన సందర్భాలు లేవు ప్రజా ప్రతినిధులు మాకు అవసరం లేడు అని మాజీ మంత్రి చెప్పిన చాలా సందర్భాలు ఉన్నాయని కౌన్సిలర్ చీర్ల సత్యం అన్నారు. మాజీ మంత్రి కలవాలంటే గెట్ దగ్గర సెంట్రీ ని పెట్టి ఎవరిని కలువకుండా నియంత పాలన చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమం లో మున్సిపాలిటీ చైర్మన్ పుట్టపాకుల మహేష్, వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు, ఆయా మండలాల నాయకులు పాల్గొన్నారు.