calender_icon.png 13 January, 2025 | 8:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిచ్చికుక్కలా వ్యవహరిస్తున్నారు

13-01-2025 02:29:08 PM

కరీంనగర్,(విజయక్రాంతి): హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం(MLA Medipally Sathyam) సోమవారం ఫైర్ అయ్యారు. కౌశిక్ రెడ్డి సైకోలా.. పిచ్చికుక్కలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు, సైకో.. పిచ్చికుక్కను ఎగదోసి ఫైశాచిక ఆనందం పొందుతున్నారని ఆరోపించారు. పార్టీల ఫిరాయింపులను ప్రోత్సహించిన నీచ సంస్కృతి బీఆర్ఎస్ ది అన్నారు. సైకో నా కొడుకులను కంట్రోల్ చేయకపోతే వీపు పగలగొట్టక తప్పదని హెచ్చరించారు. కేసీఆర్ కేటీఆర్, హరీశ్ రావులను ఎక్కడ తిరగనివ్వకుండా అడ్డుకుంటామని తెలిపారు. ఇంతకాలం ఓపిక పట్టాం.. కానీ ఒక్క క్షణం ఆలోచిస్తే ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేవు అన్నారు. కౌశిక్ రెడ్డిపై డీజీపీ కరీంనగర్ సీపీకి ఫిర్యాదు చేస్తామని మేడిపల్లి సత్యం వెల్లడించారు.