calender_icon.png 1 March, 2025 | 8:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

01-03-2025 05:45:47 PM

కరీంనగర్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హైదరాబాదులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చొప్పదండిలో నియోజకవర్గంలోని పెండింగ్ ప్రాజెక్టును పూర్తి చేయడానికి నిధుల కేటాయించాలని ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని కోరారు. పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తామని, చొప్పదండి నియోజకవర్గం అభివృద్ధికి సహకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టు ఎమ్మెల్యే తెలిపారు. చొప్పదండి నియోజకవర్గం అభివృద్ధికి సహకారం అందజేస్తామని హామీ ఇచ్చిన  సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే సత్యం కృతజ్ఞతలు తెలిపారు.