calender_icon.png 16 April, 2025 | 8:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాల్ రైటింగ్ ప్రారంభించిన ఎమ్మెల్యే మాణిక్యరావు

16-04-2025 01:29:18 AM

జహీరాబాద్, ఏప్రిల్ 15 : భారతీయ రాష్ట్ర సమితి చలో వరంగల్ కార్యక్రమానికి కార్యకర్తలందరూ తరలిరావాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు అన్నారు. మంగళవారం జహీరాబాద్ పట్టణంలో వాల్ రైటింగ్ ఆయన ప్రారంభించారు.

బీఆర్‌ఎస్ పురుడు పూసుకుని 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వరంగల్లో ఈ నెల 27న భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే మాణిక్ రావు తెలిపారు. 25 సంవత్సరాల కాలంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ అధ్యక్షతన భారీ బహిరంగ సభ కు కార్యకర్తలందరూ సైనికుల్లా తరలిరావాలని పిలుపునిచ్చారు.

తెలంగాణలో ఎన్నో ప్రాజెక్టులు నిర్మించుకొని ప్రజా ప్రయోజనాల పథకాలను అమలు చేసి ప్రజలకు సేవ చేసిన ఘనత కెసిఆర్ దేనని తెలిపారు. కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నీటిపారుదల మంత్రిగా పనిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దేందుకు కష్టపడ్డారని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో నామ రవి, కిరణ్, ప్రభు యాదవ్, మిథున్ రాజ్, యాకూబ్ ముయోద్దీన్ తదితరులుపాల్గొన్నారు.