తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు
తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలోని కేతిరెడ్డి కాలువ మరుమతుల కోసం సుమారు 13 కోట్ల నిధులతో గొట్టిపర్తి రావులపల్లి కుక్కడం చెరువులకు నీరు వచ్చే విధంగా పనులు కొనసాగుతున్నట్లు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. మంగళవారం మండల పరిధిలో గొట్టిపర్తి గ్రామంలో కేతిరెడ్డి కాలువలను, ఊరి చివర చెరువు వద్ద రైతుల పొలాలకు వెళ్లే రహదారి, పాఠశాలలో పిల్లలకు సిసి రోడ్ నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదట పోచారం వద్ద గల బ్రిడ్జి నిర్మాణ పనులు పరిశీలించారు. పాఠశాలలో వృద్ధులు కనపడగానే బాగున్నారా అంటూ నమస్కారం చేసి వారి బాగోగులను అడిగి తెలుసుకుని, ప్రతి ఒక్కరికి పింఛన్ వచ్చే విధంగా కృషి చేస్తానని అన్నారు.
అనంతరం రావులపల్లి గ్రామంలో ఇటీవల వరదలకు కొట్టుకుపోయిన రోడ్డును . పరిశీలించారు. వెంబటిలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఐ బి డి ఈ అధికారులు సత్యనారాయణ, అనిల్ కుమార్ ఏఈ శ్రీకాంత్, ఏవో బాలకృష్ణ, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్, డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు మండల పార్టీ అధ్యక్షులు దొంగరి గోవర్ధన్ మండల ఉపాధ్యక్షులు చింతకుంట్ల వెంకన్న గ్రామ శాఖ అధ్యక్షులు చిలకల వెంకన్న మాజీ ఎంపీటీసీ కేతిరెడ్డి లతా విజయకుమార్ రెడ్డి, కృష్ణారావు, కేతిరెడ్డి రవీందర్ రెడ్డి, దాయం ఝాన్సీ రెడ్డి, భాష బోయిన వెంకన్న, మాజీ సర్పంచ్ వెంకన్న, బికోజి నాయక్ తదితరులు పాల్గొన్నారు.