calender_icon.png 15 January, 2025 | 10:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గత పాలకుల నిర్లక్ష్యం... దళితులకు కష్టాలు

04-09-2024 05:13:32 PM

కేశవపురం బంధంపై బ్రిడ్జి నిర్మాణం ఏర్పాటుకు కృషి చేస్తా

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు

తుంగతుర్తి,(విజయక్రాంతి): గత పాలకుల నిర్లక్ష్యముతో కేశవపురం బంధంపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడంతోనే రైతులు గ్రామస్తులు కష్టాలు అనుభవిస్తున్నారని త్వరలోనే బంధంపై బ్రిడ్జి నిర్మాణం ఏర్పడి కృషి చేస్తానని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. బుధవారం మండల పరిధిలోని కేశవపురం గ్రామం వద్దగల బంధంను పరిశీలించి మాట్లాడారు. రైతులు తమ ఆవేదన తెలియపరచగా తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి లతో మాట్లాడి ప్రత్యేకంగా నిధులు కేటాయించి రానున్న రోజులో త్వరితగదన్న బ్రిడ్జి నిర్మాణాన్ని కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీనితోపాటు రావులపల్లి మిరియాల మా నాయకుంట గ్రామంలో వృద్ధురాలు చనిపోయిందని, గొర్రెలు మేకలు పశువులు మృతిచెందాయని తెలిపారు.

గ్రామాల్లో వ్యవసాయ శాఖ అధికారులు కలియ తిరుగుతూ పంట నష్టంపై పూర్తిగా పరిశీలించిన పిదప నష్టపరిహారం అందించినట్లు తెలిపారు. గ్రామస్తులు ఆవేదన చెందకూడదని అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.  అర్వపల్లి కేజీబీవీ పాఠశాల చెరువు పక్కన పెట్టడం వల్ల విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు తాసిల్దార్  గ్రామాలు మానిటర్ చేసి తెలియపరచాలని కోరారు. ఇటీవల మృతి చెందిన పలు కుటుంబాలను పరామర్శించి ,ఆర్థిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ డీఈ అనిల్ కుమార్ ,ఏయి శ్రీకాంత్ తాసిల్దార్ కంటమయ్య, టిపిసిసి నాయకులు గుడిపాటి నరసయ్య డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు, మండల పార్టీ అధ్యక్షులు దొంగరి గోవర్ధన్ తిరుమల ప్రగడ అనురాధ కిషన్ రావు ,గ్రామ శాఖ అధ్యక్షులు కోడి సైదులు, గుండ గాని మహేందర్ గౌడ్, సుంకర జనార్ధన్, భాస్కర్ నరసయ్య, జనార్ధన్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.