calender_icon.png 2 March, 2025 | 1:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి పదవిపై ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి హాట్ కామెంట్

01-03-2025 11:01:57 PM

రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవీ కేటాయించాలని డిమాండ్

సామాజిక సమీకరణే అడ్డు అయితే తాను రాజీనామా కు సిద్దం అంటూ ప్రకటన

మంత్రి పదవీ పై మల్‌రెడ్డి ప్రకటన పై జిల్లాలో  విస్తృత చర్చ

రంగారెడ్డి,(విజయక్రాంతి):  సీనియర్ కాంగ్రెస్ నేత, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవీపై శనివారం హాట్ కామెంట్ చేశారు. రంగారెడ్డి జిల్లాలో 42 లక్షలకు పైగా జనాభా ఉందని ఇంతటి ప్రాధాన్యత కల్గిన జిల్లాకు ఒక మంత్రి పదవీ ఉండాలని చేప్పారు. సామాజిక సమీకరణలో మంత్రి పదవీ కేటాయింపులో ఇబ్బందులు గురైతే రంగారెడ్డి జిల్లా అభివృద్ధి కోసం తాను ఎమ్మెల్యే పదవీకి సైతం తాను రాజీనామా కు సిద్దం అంటూ ఆయన కామెంట్ చేశారు. మల్‌రెడ్డి రంగారెడ్డి చేసిన పొలిటికల్ కామెంట్  జిల్లాలో ప్రస్తుతం  తీవ్ర చర్చనీయాంశం గా మారింది. ఇబ్రహీంపట్నం నుంచి నేను రాజీనామా చేసి ఒక బీసీ ఎమ్మెల్యే ను గెలిపించుకొంటానని పేర్కొన్నారు.  పార్టీ ఆదిష్టానం రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు అన్యాయం చేయొద్దని ఆయన హితవు పలికారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వారికి గౌరవం ఇవ్వాలని... కాని పదవులు కాదన్నారు. ఇటివలనే పార్టీలోకి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చారని ఆయన ఆవేదన వెల్లిబుచ్చారు.

పార్టీ కోసం ఆహర్నిశలు శ్రమించిన వారిని పార్టీ పక్కకు పెట్టడం సరికాదని, ఇట్టి విషయాన్ని పార్టీ ఆదిష్టానం గుర్తించాలని ఆయన విజ్ఙప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆదిష్టానం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మంత్రి పదవుల భర్తీ పై పలువురు ఎమ్మెల్యేలు గంపెడశలు పెట్టుకొన్నారు. ఢిల్లీ స్థాయిలో తమ పలుకుబడిన ఉపయోగించి మంత్రి పదవులను దక్కించుకొనేందుకు తీవ్ర ప్రయత్నాలు మాత్రం చేస్తున్నారు. దీంతో పార్టీ ఆదిష్టానం మాత్రం మంత్రి పదవుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంది.. సామాజిక, రాజకీయ పరంగా లెక్కలు కడుతూ మంత్రి పదవులు భర్తీచేసేలా ప్రణాళికలు వేస్తోంది. దీంతో  మంత్రి పదవులు నియామకంలో  తీవ్ర జాప్యం జరుగుతుంది.  సంక్రాంతి పండుగ ముందే మంత్రి పదవులు భర్తీ చేసేందుకు ఆదిష్టానం గ్రీన్ సిగ్నల్  ఇచ్చిందని ప్రచారం కుడా జరిగింది. దీంతో పలువురు ఆశావహులు ఢిల్లీ లో తమకు అనుకూలమైన నేతల చుట్టూ ప్రదీక్షణలు చేస్తూ మంత్రి పదవులు దక్కించుకొనేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు.

రంగారెడ్డి జిల్లా నుంచి సీనియర్ నేత మల్‌రెడ్డి రంగారెడ్డి కుడా మంత్రి పదవి ని దక్కించుకొనేందుకు  తీవ్ర ప్రయత్నాలు చేశారు. రాష్ట్రంలో మారిన తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో  మంత్రి పదవుల భర్తీ విషయంలో ఆదిష్టానం బ్రేక్ వేసింది.  రంగారెడ్డి జిల్లాలో 8 ఎనిమిది నియోజకవర్గాలు ఉండగా షాద్‌నగర్ నుంచి వీర్లపల్లి శంకర్, ఇబ్రహీంపట్నం నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డి  కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు గా గెలుపొందారు. శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, చేవెళ్ల, ఎల్‌బీనగర్, మహేశ్వరం నియోజకవర్గాలో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు గెలువగా మహేశ్వరం నుంచి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎల్‌బీనగర్ నియోజకవర్గం సుధీర్‌రెడ్డిలు మాత్రం ప్రస్తుతం బీఆర్‌ఎస్ పార్టీలో కొన సాగుతున్నారు. రాజేంద్రనగర్  ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్, చేవెళ్ల  ఎమ్మెల్యే  కాలె యాదయ్య, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఇటిలనే రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొన్నారు.