11-03-2025 12:17:05 AM
మేడ్చల్, మార్చి 10 (విజయ క్రాంతి): మేడ్చల్ మండలం గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మైసమ్మగూడలో శ్రీ మల్లన్న స్వామి కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, గుండ్ల పోచంపల్లి మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ మండలం నూతనకల్, మూడు చింతలపల్లి మండలం అనంతారం గ్రామాల్లోనూ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవంలో మల్లారెడ్డి పాల్గొన్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.