పెద్దపల్లి (విజయక్రాంతి): రామగుండం కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు కార్పొరేటర్ బొంతల రాజేష్ ను రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గురువారం పరామర్శించారు. గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది, ఆసుపత్రి నుండి బొంతల రాజేష్ ఇటీవల ఇంటికి వచ్చారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరామర్శించి, ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొని దైర్యం కల్పించారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వివిధ విభగల అధ్యక్షులు తదితరులు ఉన్నారు.