calender_icon.png 12 April, 2025 | 11:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ర్యాలీ చేపట్టిన మ్మెల్యే మైనపల్లి రోహిత్ రావు

04-04-2025 09:56:55 PM

చేగుంట,(విజయక్రాంతి): మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో శేరిపల్లి  గ్రామంలో శుక్రవారం పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు పార్టీ నాయకులు కార్యకర్తలు చేత భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం, గాంధీ చిత్రపటం వద్ద కొబ్బరికాయ కొట్టి పూలమాలనువేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... జై బాపు  జై భీమ్ జై సంవిధాన్ ర్యాలీ లక్ష్యం రాజకీయ ప్రయోజనాల కోసం కాదని గుర్తు చేశారు. మహాత్మా గాంధీ మరియు బిఆర్ అంబేద్కర్ చేసిన కృషిని గుర్తు చేసుకోవడమని అన్నారు.