calender_icon.png 1 November, 2024 | 6:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈడీ ఎదుట ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి హాజరు

03-07-2024 12:03:47 AM

పటాన్‌చెరు, జూలై 2 : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. మైనింగ్ కేసులో ఈడీ ఆయనపై అభియోగాలు మోపిన సంగతి తెలిసిందే. మైనింగ్ కేసులో మహిపాల్ రెడ్డి రూ. 300 కోట్లకు పైగా అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ ఆరోపించింది. ఈ క్రమంలోనే జూన్ 19న ఈడీ అధికారులు పటాన్‌చెరులోని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఆయన సోదరుడు గూడెం మధుసూదన్‌రెడ్డి ఇళ్లలో, జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో, నిజాంపేటలో నివసించే ఆయన బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మైనింగ్ సీనరేజ్, పెనాల్టీతో కలిపి రూ.341 కోట్లు చెల్లించాల్సిందిగా ఈడీ అధికారులు గుర్తించారు. ఉదయమే ఈడీ విచారణకు వెళ్లిన ఆయన సాయం త్రం కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. కార్యాలయం వద్ద మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయారు.