18-04-2025 08:04:49 PM
బైంసా,(విజయక్రాంతి): దుబాయ్ లో మృతి చెందిన ప్రేమ్ సాగర్ కుటుంబ సభ్యులను శుక్రవారం ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, సొన్ మండల కేంద్రానికి చెందిన ఆష్టం ప్రేమ్ సాగర్ ఇటీవల దుబాయ్ లో హత్యగావించబడ్డాడు. ఈ విషయమై బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంబంధిత అధికారులు, విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడి మృత దేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేదిశగా చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రగాఢ సానుభూతి తెలిపారు. రెండు మూడు రోజుల్లోపే ప్రేమ్ సాగర్ మృతదేహం స్వదేశానికి తీసుకువచ్చేందుకు అన్ని విధాలా సహాకారం అందిస్తామని తెలిపారు. మండల జిల్లా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.