దేవరకద్ర: క్రీడల అభివృద్ధి కోసం ప్రభుత్వము అన్ని విధాల కృషి చేస్తుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. బుధవారము మండల కేంద్రంలోని మండల స్థాయి క్రీడల పోటీలను ఆయన ప్రారంభించారు. కబడ్డీ వాలీబాల్ తదితర పోటీలను ఆయన ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల పోటీల్లో గెలుపు ఓటమిలో సహజమని ,యువకులకు విద్యతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని అన్నారు. క్రీడల అభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలుఅందిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అంజిల్ రెడ్డి, సయ్యద్ ఫారూఖ్ ఆలీ జవహర్ కొన రాజశేఖర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.