calender_icon.png 23 December, 2024 | 8:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంపూర్ణ ఆరోగ్యంతోనే నిండు జీవితం

23-12-2024 04:17:23 PM

ప్రాణం కంటే అత్యవసర పరిస్థితి ఏముంటుంది 

అంబులెన్స్ వేలాదిమంది ప్రాణాలను కాపాడుతున్నాయి 

108 అంబులెన్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి

మహబూబ్ నగర్,(విజయక్రాంతి) : సంపూర్ణ ఆరోగ్యంతోనే నిండు జీవితం ప్రతి ఒక్కరి సొంతం అవుతుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి అన్నారు. సోమవారం మూసపేట మండల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం నందు 108 అంబులెన్స్ ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ... క్షతగాత్రులను వైద్యంకోసం తరలించేందుకు అంబులెన్సులు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో కుంటుపడిన వైద్య రంగాన్ని కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రక్షాళన చేయడం జరుగుతుందని, ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే వైద్యారోగ్యశాఖపై ఏకంగా రూ.10 వేల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు.

ప్రాణం కంటే అత్యవసర పరిస్థితి ఏముంటుందని తెలిపారు.  మండల కేంద్రాలలో  అత్యవసర సమయాల్లో వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు 108 అంబులెన్సులను అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు. అంబులెన్స్ లు వేలాదిమంది ప్రాణాలను కాపాడుతున్నాయని తెలియజేశారు. అనంతరం మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు వర్థంతి సందర్భంగా వారి చిత్రపటానికి ఎమ్మెల్యే జిఎంఆర్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు ఉన్నారు.