calender_icon.png 25 December, 2024 | 6:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీధి వ్యాపారస్తుల జోలికి వస్తే సహించేది లేదు

24-12-2024 05:41:47 PM

కూకట్ పల్లి,(విజయక్రాంతి): వీధి వ్యాపారస్తులకు జోలికి వస్తే సహించేది లేదని కుకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఇటీవల కెపిహెచ్బి కాలనీ 9వ ఫేజ్ నుంచి 5వ ఫేజ్ వరకు ఫుట్ పాత్ లపై వ్యాపారాలు చేస్తూ జీవనం కొనసాగిస్తున్న నిరుపేదలకు దుకాణాలను డబ్బాలను తొలగించడం దౌర్భాగ్యమైన చర్య ఆని ఆయన ఆరోపించారు. మంగళవారం దుకాణాలు కోల్పోయిన బాధితులను ఆయన కలిశారు. పేద ప్రజల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేక జిహెచ్ఎంసి, ట్రాఫిక్ అధికారులను ఉసి గొల్పి వారి జీవనోపాధికి ఆటంకం కలిగిస్తున్నారని అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఇటువంటి చర్యలకు ఎప్పుడు పూనుకోలేదని ఆయన గుర్తు చేశారు. ప్రజా వ్యతిరేకానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీనివాసరావు మాజీ కార్పొరేటర్ బాబురావు సాయిబాబా చౌదరి తదితరులు పాల్గొన్నారు.