calender_icon.png 7 October, 2024 | 7:57 PM

బతుకమ్మ పండుగ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

07-10-2024 05:03:26 PM

కూకట్‌పల్లి : తెలంగాణ మహిళలు ఎంతో ఘనంగా జరుపుకునే బతుకమ్మ పండుగకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని కూకట్‌పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం కూకట్‌పల్లి రంగదాముని చెరువు వద్ద బతుకమ్మ పండుగ, నిమజ్జన ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచులు అత్యంత వైభవంగా చేసుకునే బతుకమ్మ పండుగకి ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా ఏర్పాట్లను చేపట్టాలని అధికారులకు సూచించారు. బతుకమ్మ ఆటలాడడానికి వచ్చిన మహిళలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు శిరీష, ఆవుల రవీందర్ రెడ్డి, జిహెచ్ఎంసి, ఇంజనీరింగ్, వాటర్ వర్క్స్, ఎలక్ట్రికల్, పోలీస్, శానిటేషన్ అధికారులు పాల్గొన్నారు.