కూకట్పల్లి, (విజయక్రాంతి): అర్హులైన లబ్ధిదారులకు కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(Kukatpally MLA Madhavaram Krishna Rao) అన్నారు. శనివారం నిజాంపేట లోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అధికారులు, లబ్ధిదారులతో కలిసి పరిశీలించారు. వారికి కేటాయించిన డబుల్ బెడ్రూంలో ఎటువంటి వసతులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఎమ్మెల్యే అధికారులతో పేర్కొన్నారు. ప్రధానంగా మంచినీటి సమస్య తో పాటు విద్యుత్, సెల్లార్ లో వర్షం నీరు చేరడంతో లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు.
ప్రజల పైన ప్రభుత్వానికి పట్టింపు లేదు. పేదలకు తెలంగాణ ప్రభుత్వం(Telangana Government ) ప్రజా పాలన పేరిట సేవలు అందిస్తామని నోటి మాటల ద్వారా చెప్పడమే తప్ప క్షేత్రస్థాయిలో ఏమి జరగడంలేదని ఎద్దేవా చేశారు. మౌలిక వసతులకు సంబంధించి ప్రజలు ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్న కనీసం ప్రభుత్వం ఇటు వైపు చూసిన పాపాన పోలేదని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి డబుల్ బెడ్ రూమ్(Double Bedroom) లో ఉండాలి సమస్యలను దశలవారీగా పరిష్కరించి లబ్ధిదారులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కూకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ(Kukatpally Corporator Jupally Satyanarayana), నిజాంపేట్ కమిషనర్ తో పాటు ఎలక్ట్రికల్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.