calender_icon.png 22 January, 2025 | 6:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రైనేజీ పైప్ లైన్ పనులు అడ్డుకున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి

22-01-2025 03:39:08 PM

కూకట్ పల్లి,(విజయక్రాంతి): డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆటంకం కలిగించిన వారిపై చర్యలు తీసుకోవాలని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. గోపాల్ నగర్ నుండి ముళ్లకత్వ వరకు నూతనంగా నిర్మాణం చేపడుతున్న డ్రైనేజీ పైప్ లైన్ పనులను గోపాల్ నగర్ కాలనీ వద్ద కొంతమంది మా స్థలం నుండి పైప్ లైన్ వేయొద్దని అభ్యంతరం తెలిపారు. దీంతో ఈ విషయమై స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన బుధవారం పనులు జరుగుతున్న కాలనీకి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ గోపాల్ నగర్ లేఅవుట్ నుండి వెళ్తున్న రోడ్డు వాటర్ వర్క్స్ సంబంధించిందని, జిహెచ్ఎంసిలో 200 ఫీట్లు మాస్టర్ ప్లాన్ లో ఉన్నట్లు గుర్తించారు. పైప్ లైన్ పనులు అడ్డుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. వర్షాకాలం లోపు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డ్రైనేజీ పైప్ లైన్ పనులు పూర్తయితే గోపాల్ నగర్ కాలనీకి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అసోసియేషన్ సభ్యులు కలిసి ఇట్టి పనులు పూర్తయ్యేలా అధికారులకు సహకరించాలని గోపాల్ నగర్ వాసన ఎమ్మెల్యే కోరారు. డ్రైనేజీ నిర్మాణ పల్లవి అడ్డగిస్తే అట్టి వ్యక్తులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు, కూకట్పల్లి ఎమ్మార్వో స్వామి, వాటర్ వర్క్స్ జిఎం ప్రభాకర్, టౌన్ ప్లానింగ్ ఏసిపి రమేష్, డి ఈ శంకర్ తదితరులు  ఉన్నారు.