calender_icon.png 20 January, 2025 | 7:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధిని అటక్కించి ప్రభుత్వ స్థలాలను అమ్మకానికి పెట్టిన సర్కార్

20-01-2025 04:31:30 PM

కూకట్ పల్లి,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధిని అటకెక్కించి ప్రభుత్వ స్థలాలను అమ్మడానికి పూనుకుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram Krishna Rao) ఆరోపించారు. కెపిహెచ్బి కాలనీలో ఉన్న వేణుగోపాలస్వామి ఆలయం మండపాన్ని  హౌసింగ్ బోర్డ్ అధికారులు సీజ్ చేసిన విషయాన్ని తెలుసుకున్న ఆయన సోమవారం ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... హౌసింగ్ బోర్డ్ కాలనీ రమ్య గ్రౌండ్ పార్కు స్థలాన్ని సైతం హౌసింగ్ బోర్డ్ అధికారి బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది. గత పది పదేళ్లలో మాజీ మంత్రి కేటీఆర్ సహకారంతో ఇక్కడి ప్రజల సౌకర్యం కోసం పార్క్ లు, ఆట స్థలాలు ఏర్పాటు చేశామన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయా స్థలాలను అమ్మకానికి పెట్టి కోట్ల రూపాయలు దండుకుంటుందని ఆరోపించారు.

హౌసింగ్ బోర్డ్ స్థలాలలో ప్రజా ప్రయోజనాల కోసం 10% భూములను పార్కులకు కేటాయించాలని, ఎటువంటి కేటాయింపులు చేయకుండా వేలం పాట ఎలా వేస్తారని ఆయన అధికారులు, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆలయ మండపాన్ని సీజ్ చేసి విషయంలో కనీసం ఆలయ సిబ్బందికి సమాచారం ఇవ్వకుండా ఎలా సీజ్ చేస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ధోరణిని మార్చుకోకపోతే ఈనెల 24 వ తేదీన చేపట్టనున్న వేలం పాటను బిఆర్ఎస్ పార్టీ అడ్డుకోవడానికి సిద్ధంగా ఉందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కెపిహెచ్బి కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ బాబురావు, సతీష్ అరోరా స్థానిక నాయకులు కృష్ణారెడ్డి, సాయిబాబా చౌదరి, శ్యామల రాజు, రాజేష్, పవన్, పి ఎల్ ప్రసాద్ తదితరులు ఉన్నారు.