calender_icon.png 26 January, 2025 | 12:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హౌసింగ్ బోర్డ్ స్థలాల వేలంపాటపై ఎమ్మెల్యే మాధవరం ఆగ్రహం

25-01-2025 12:00:00 AM

కూకట్ పల్లి జనవరి 24 (విజయక్రాంతి): సామాన్య ప్రజల సొంతింటి కలను నిజం చేయడం కోసం ఏర్పడ్డ హౌసింగ్ బోర్డు ఫక్తు రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థగా మారి మోసపూరితంగా భూములును అమ్మడం పట్ల ఏమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ మండలి (TSHB) మోసపూరిత వైఖరిని ఎండగడుతూ రోడ్డులో పోతున్న ప్లాట్ల వేలం ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ వేలం పాట ను అడ్డుకుంటామని ప్రకటించిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తో పాటు నియోజకవర్గం లోని బీ ఆర్ ఎస్ పార్టీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులను పోలీసులు శుక్రవారం హౌస్ అరెస్ట్ చేశారు. కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందిని మొహరించి వేలం పాట కు వెళ్లకుండా అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ కూకట్పల్లి నియోజకవర్గంలో సామాన్య ప్రజలు హౌసింగ్ బోర్డు చేతిలో మోసపోవద్దని సూచించారు. ఏకంగా హుడా మాస్టర్ ప్లాన్ లో 100 ఫీట్లు రోడ్డుగా చూపిన కెపిహెచ్బి 15 వ ఫేస్ లోని ఖాళీ స్థలాలను, 200 ఫీట్ల రోడ్డుగా చూపిన 7 వ ఫేస్ లోని ఖాళీ స్థలాలను మోసపూరితంగా 80 అడుగుల రోడ్డుగా చూపుతూ రోడ్డు స్థలాలను అమ్మకానికి పెట్టడం హౌసింగ్ బోర్డు అధికారుల నీతి మాలిన చర్యకు నిదర్శనమన్నారు.