calender_icon.png 17 April, 2025 | 12:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టిఎన్జీవోస్ నూతన భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

08-04-2025 08:51:13 PM

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో నిర్మిస్తున్న టీఎన్జీవోస్ నూతన భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి మంగళవారం నాడు స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ ఉద్యోగుల కోసం అందుబాటులో ఉండే ఆధునిక సౌకర్యాలతో కూడిన కార్యాలయ భవనం ఎంతో అవసరమని త్వరలో అలాంటి భవనం పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ప్రభుత్వాలు తలపెట్టే పథకాలను ప్రజలకు చేరవేయడంలో ఉద్యోగుల పాత్ర కీలకమని వారి సేవలను కొనియాడారు. ఉద్యోగుల హక్కులు అవసరాల పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో మండలంలోని టీఎన్జీవోస్ ఉద్యోగులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.