calender_icon.png 11 March, 2025 | 3:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నెలమత్తడి కట్టు కాలువ నిర్మాణంతో రైతుల ఏళ్ల కల నేరవేరింది

25-01-2025 11:58:05 PM

నెలమత్తడి కట్టు కాలువ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

 ఎమ్మెల్యే మధన్‌ మోహన్‌ రావు

కామారెడ్డి,(విజయక్రాంతి): నెలమత్తడి కట్టు కాలువ నిర్మాణంతో రైతుల ఏళ్ల కల నేరవేరిందని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మధన్‌మోహన్‌రావు అన్నారు. శనివారం సాయంత్రం లింగంపేట మండల కేంద్రంలోని కట్టు కాలవ నిర్మాణ పనులతో పాటు సీసీ రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. లింగంపేట రైతుల వరప్రదాయమైన కట్ట కాలువ పూర్తిగామట్టితో కూడికపోవడంతో సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. పలుసార్లు ప్రజాప్రతినిధులకు అధికారుల దృష్టికి తీసుకొచ్చిన ఫలితం లేకుండా పోయింది ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మధన్‌మోహన్‌రావు దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించి కట్టు కాలువ పుననిర్మాణానికి 49 లక్షల నిధులు మంజూరు చేశారు. నిధులతో పనులు వేగవంతం కొనసాగుతున్నాయి. రానున్న ఖరీప్ సీజన్ నాటికి రైతులకు సాగునీరు అందించి తీరుతామన్నారు. చెరువులు కుంటలు ఎప్పుడు నిండుకుండలా  కళకళలాడాలన్నారు. ఎన్నో ఏళ్ల కల నెరవేరిందని రైతులు ఎమ్మెల్యేకు తెలిపారు. కాంగ్రెస్‌ప్రభుత్వం రైతుల కోసమే పనిచేస్తుందన్నారు.