మహదేవపూర్, జనవరి 2: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణ రావు. ఎమ్మెల్యే మండలంలోని వివిధ గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు స్థాని క ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు, వివిధ శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే శంకు స్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.
ముం దుగా మైలారం గ్రామంలో రూ.37.72 లక్షల ఎఫ్డీఆర్ నిధులతో ఎస్‌ఆర్‌ఎస్పి - 34 ఆర్ కాలువ శాశ్వత మరమ్మత్తు పనులను ప్రారంభించారు. అనంతరం అదే గ్రామం లో రూ.8 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న అంగన్వాడీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. బుర్ర కాయలగూడెంలో రూ.10 లక్షలతో కొత్తగా నిర్మించిన గ్రామపంచాయతీ బిల్డింగ్ ను ప్రారంభించారు.
అనంతరం గణపురం లో రూ. 20 లక్షలతో రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం సీతా రాంపూర్ లో రూ.20 లక్షలతో నూతన గ్రామ పంచాయతీ నిర్మాణ పనులకు శంకు స్థాపన చేశారు.రూ.10 లక్షలతో ధర్మా రావుపేట లో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. బస్వరాజుపల్లిలో రూ.10 లక్షలతో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
చెల్పూర్ మేజర్ గ్రామ పంచాయతీలో రూ.5 లక్షలతో ఈద్గా లో సీసీ ఫ్లోరింగ్ మరియు రూ.5 లక్షలతో ఆర్ అండ్ బి రోడ్డు నుండి పెద్దమ్మ తల్లి దేవాలయం వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సంద ర్భంగా సీతారాంపూర్‌లో ఎమ్మెల్యే మాట్లా డుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్క పేద ప్రజలకు అందేలా చూస్తానని అన్నారు.
ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వ యంతో ప్రజల భాగస్వామ్యంతో ప్రజా ప్ర భుత్వంలో గ్రామాలను అభివృద్ధి చేస్తుందని తెలిపారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. గుత్తే దార్లు నాణ్యతతో కూడిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, నాణ్యతలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. అనంతరం ఎస్టీయూ టీఎస్ ఉపాద్యాయ సంఘం క్యాలెండర్, డైరీ ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యక ర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.