09-04-2025 01:22:03 AM
టేకులపల్లి, ఏప్రిల్ 8 (విజయక్రాంతి):ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని ప్రతి అర్హుడైన నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. మంగళవారం టేకులపల్లి మండలం కోయగూడెం గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ళకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మళ్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైన ఇండ్లకు పనులు మొదలు పెడుతున్నామన్నారు.
ప్రతి ఒక్క లబ్ధిదారులు సొంతగా నిర్మించుకుంటే మంచిదని, ఎక్కువ కొలతలు పెట్టి ఖర్చు పెరిగి ఇబ్బంది పడొద్దన్నారు. అతి త్వరలో నియోజకవర్గం పరిధిలోని అన్ని గ్రామాలలో అర్హులైన ప్రతీ ఒక్క కుటుంబానికి ఇండ్లను మంజూరు చేయిస్తామన్నారు. ఎలాంటి లోటుపాటులు లేకుండా నిజమైన పేదవాళ్ళని గుర్తించి పారదర్శకంగా ఎంపిక పక్రియ నిర్వహించి వారికీ ఈ పథకాన్ని అందజేసే విధంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.
ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపిన విధంగా ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామన్నారు. రైతును రాజు చేసే విధంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు చేపడుతుందని, దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణాలో సన్న బియ్యం ఉచితంగా ఇస్తుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ జీతేష్ వి పాటిల్ మాట్లాడుతూ.. లబ్ధిదారులు సొంత నిర్ణయాలతో ఇంటిని నిర్మిచుకుంటే ఖర్చు పెరగదన్నారు.
ఖర్చు పెంచి నిర్మాణం చేస్తే ఇబ్బంది పడతారని వివరించారు. భద్రాచలం ఐ టి డి ఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్, గృహనిర్మాణ శాఖ పిడి శంకర్, తహశీల్ధార్ నాగాభవాని, ఎంపీడీఓ రవీందర్ రావు, డీఎస్ పి చంద్రభాను, ఎంపిఓ గణేశా గాంధీ, సిఐ తాటిపాముల సురేష్, ఎస్త్స్రలు సురేష్, శ్రీకాంత్, కాంగ్రెస్ నియోజక వర్గ నాయకులూ కోరం సురేందర్, మాజీ సర్పంచ్ కోరం ఉమా,
కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భూక్యా దేవా నాయక్, నాయకులు ఈది గణేష్, మోకాళ్ళ పోశాలు, రెడ్యానాయక్, వీరభద్రం, బండ్ల రజినీ, శ్రీనివాస్, శశికల, సరిత, రజియా, శంకర్, ముచ్చా సుధాకర్, బానోత్ రవి, భద్రు, సర్దార్, లక్కినేని శ్యామ్, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, తదితర నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.