calender_icon.png 3 April, 2025 | 2:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సన్న బియ్యం పంపిణి కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే

01-04-2025 11:13:46 PM

కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో నిలుస్తాయి..

సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్..

పెనుబల్లి (విజయక్రాంతి): మండలం పరిధిలో చింతగూడెం గ్రామ పంచాయతీ చింతగూడెం (ముత్త గూడెం) గ్రామంలో సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ రేషన్ సన్నబియ్యంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద, మధ్యతరగతి ప్రజలకు రేషన్ ద్వారా సన్నబియ్యం అందించటం తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఎంతో సంతోషంగా వుంది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు మాత్రమే కాదు. ప్రజలు కష్టాలు తెలుసుకొని మరెన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నదని తెలిపారు. 

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు భట్టి, తుమ్మల, పొంగులేటి ఆధ్వర్యంలో సత్తుపల్లి నియోజకవర్గం అభివృద్ధి, మొన్న పామాయిల్ ఫ్యాక్టరి శంకుస్థాపన చేసుకున్నాం త్వరలో రాష్ట్ర ముఖ్య మంత్రి  రేవంత్ రెడ్డి మరియు జిల్లా మంత్రులు ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్, సత్తుపల్లి ప్రభుత్వం ఆసుపత్రి, కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభం జరుగుతుందని తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ గారడీ మాటలు, అబద్దపు మాటలు ప్రజలు ఎవరు నమ్మకండి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న పథకాలు చూస్తూనే వున్నాము. అర్హులకు కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు అందుతాయి.  కార్పొరేషన్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు ఆర్థిక సహాయం కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. 

సన్నబియ్యం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సందర్బంగా పేద, మధ్య తరగతి కుటుంబాల్లో సంతోషం చూస్తున్నాము. ప్రజలు గుండెల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు నిలుస్తాయని ఎమ్మెల్యే  తెలిపారు. ఈ కార్యక్రమంలో కల్లూరు మార్కెట్ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి, వైస్ చైర్మన్ కోటేశ్వరరావు, ఆళ్లకుంట నరసింహారావు,పెనుబల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంది వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు మాధవరెడ్డి, పెనుబల్లి మండలం, చింతగూడెం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా, యూత్ నాయకులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.