నారాయణఖేడ్,జనవరి 21: నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని మంగళ్ పెట్, చాంద్ ఖాన్ పల్లి వార్డులలో నిర్వహించిన గ్రామసభ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో మాట్లాడారు.
తమ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తామని అన్నారు. మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షట్కార్, వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్, కమిషనర్ జగ్జీవన్, కౌన్సిలర్లు వివేకానంద, రాజేష్ చౌహాన్ , రామకృష్ణ , మాజీ నరసింహులు, సద్దాం, హనుమాన్లు, అభిషేక్ షట్కార్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాహెర్, పండరి రెడ్డి, ముంతాజ్ సెట్ మాజీ ఎంపిటిసిలు జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.