12-04-2025 10:51:11 PM
జుక్కల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని పెద్ద గుల్లా, పెద్ద ఏడికి గ్రామాల్లో దత్తాత్రేయ మందిరం హనుమాన్ ఆలయాల్లో శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పెద్దగుల్ల గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించడానికి బోరు వేయించి బోర్ మోటార్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.