calender_icon.png 27 November, 2024 | 1:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

26-11-2024 11:15:54 PM

ఇల్లెందు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం ఇల్లెందు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మంగళవారం శంకుస్థాపనలు చేశారు. సుదిమల్ల గ్రామ పంచాయతీ కొత్తూరు గ్రామంలో రూ. ఐదు లక్షలతో సీసీ రోడ్డు, మాణిక్యారం పంచాయతీలోని మర్రిగూడెం వద్ద రూ. 25 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే కోరం కనకయ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతుందని తెలిపారు. ప్రజలకు అవసరమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఇప్పటికే పలు సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే సబ్సిడీపై గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని తెలిపారు. రానున్న కాలంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు, రైతులకు రైతు భరోసా ఇవ్వనున్నమన్నారు. కాంగ్రెస్ పార్టీ పేద, బడుగు, బలహీనవర్గాల పార్టీ అన్నారు. రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పులి సైదులు, మండల రాము, రాంబాబు, కిన్నెర నర్సయ్య, సురేందర్, కృష్ణ ప్రసాద్, పద్మ, శారద, భార్గవ్, చెన్నూరు కృష్ణ, ఆరెం కిరణ్, తాటి భిక్షం, వెంకటమ్మ, మూతి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.