18-04-2025 07:05:33 PM
ఎమ్మెల్యే కూనంనేని
పాల్వంచ,(విజయక్రాంతి): పేదరికంలో తమ ఆడపిల్లలకు వివాహం చేయలేని స్థితిలో ఉన్న తల్లిదండ్రులకు, ఆ ఇంటి ఆడపడుచులకు ప్రభుత్వం అమలుచేస్తున్న కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ పథకం వరంలాంటిదని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ పథకంక్రింద మంజూరైన 46 చెక్కులను శుక్రవారం పాల్వంచ మున్సిపల్ కార్యాలయంలో లబ్దిదారులకు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ గత ప్రభుత్వం అమలుచేసిన షాదిముబారక్, కల్యాణలక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మరింత మెరుగుపర్చి అమలుచేయడం అభినందనీయమన్నారు. పేద కుటుంబాలు, ప్రధానంగా మహిళల ఆర్ధిక అవసరాలు గుర్తించి ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని, ఆరోగ్యారెంటి పథకాల అమలుకు శ్రీకారం చుట్టిందని, అతిత్వరలో పూర్తిస్థాయిలో ఈ పథకాలన్నీ అమల్లోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పేదకుటుంబాలు ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని లబ్ధిపొందాలని కోరారు.