18-03-2025 01:17:13 PM
నాగర్ కర్నూల్, విజయక్రాంతి: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పూర్తిగా పాడుబడి ఎప్పుడు కూలుతుందో తెలియని విధంగా మారిందని కళాశాల పునర్నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు కేటాయించాలని కోరుతూ మంగళవారం స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి(MLA Kuchukulla Rajesh Reddy ) అసెంబ్లీలో ప్రస్తావించారు. 1967లో నిర్మించబడిన ఈ కళాశాల ప్రస్తుతం ఎప్పుడు వెళ్తుందో తెలియని పరిస్థితి నెలకొందని విద్యార్థులు కళాశాలలో చేరేందుకు జంకుతున్నారని ఫలితంగా పేద విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కళాశాల పునర్నిర్మాణం కోసం ప్రభుత్వం తగిన నిధులు కేటాయించాలని అసెంబ్లీలో ప్రస్తావించారు.