calender_icon.png 21 April, 2025 | 6:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దళారులను నమ్మి మోసపోవద్దు

21-04-2025 01:18:13 PM

ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి 

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని స్థానిక ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి(MLA Kuchukulla Rajesh Reddy) అన్నారు. సోమవారం నియోజకవర్గ పరిధిలోని తిమ్మజిపేట ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. వరి కోతలు అనంతరం దుమ్ము, ధూళి లేకుండా తూర్పు ఆరబెట్టి ఎండబెట్టి వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సరైన మద్దతు ధర అందుతుందన్నారు.

అనవసరంగా దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. కొనుగోలు కేంద్రంలోనూ సిబ్బంది అధికారులు రైతులకు త్వరితగతిన డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అకాల వర్షాల నేపథ్యంలోనూ ధాన్యం తడిసిన రైతులు(Farmers) అధైర్య పడొద్దు అన్నారు. పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. సన్నరకం వడ్లకు క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని, రైతులకు ఏ ఇబ్బంది ఉన్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.