calender_icon.png 1 April, 2025 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మధ్యవర్తులు నమ్మి మోసపోవద్దు: ఎమ్మెల్యే కోవ లక్ష్మి

29-03-2025 04:48:12 PM

95 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ 

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రభుత్వ పథకాల అమలులో లబ్ధిదారులు మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోవ లక్ష్మి మాట్లాడుతూ పేదింటి ఆటబిడ్డ పెళ్లి కొరకు అప్పటి సీఎం కేసీఆర్ ఎంతో ముందు చూపుతో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.

బీఆర్ఎస్ హయాంలో పార్టీలకు అతీతంగా అర్హులు అయిన వారికి పథకాలను అందజేయడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు అదనంగా ఒక తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్న అమలు చేయడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ హైమద్, తహసిల్దార్ రోహిత్, డిప్యూటీ తాసిల్దార్ పోచయ్య నాయకులు రవీందర్, భీమేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.