calender_icon.png 31 March, 2025 | 3:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవకాశాలను దివ్యాంగులు అందిపుచ్చుకోవాలి

28-03-2025 07:35:55 PM

ఎమ్మెల్యే కోవ లక్ష్మి

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): అవకాశాలను దివ్యాంగులు అందిపుచ్చుకోవాలని ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం జిల్లా మహిళా శిశు వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో భారత్ డైనమిక్ లిమిటెడ్ సహకారంతో దివ్యాంగులకు మంజూరు అయిన ట్రై సైకిల్ లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మానవత దృక్పథంతో సేవాభావంతో దివ్యాంగులకు ట్రై సైకిల్ అందించడం అభినందనీయమని అన్నారు. అవసరం ఉన్నవారికి చేయూత ఇవ్వడం తో స్వచ్ఛంద సంస్థలకు గుర్తింపు లభిస్తుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం దివ్యాంగులకు పెన్షన్ అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.